: గుంటూరు జిల్లాలో బాంబు దాడులు
గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం పాపాయపాలెంలో బాంబు దాడులు చోటు చేసుకున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గీయులపై టీడీపీ వర్గీయులు బాంబులతో దాడి చేశారు. గతంలో టీడీపీ కార్యకర్త వీరారెడ్డి హత్య కేసులో వైసీపీకి చెందిన వారంతా నిందితులుగా ఉన్నారు. ఓ కేసులో కోర్టుకు హాజరై వస్తుండగా ఈ దాడి జరిగింది. ఈ ఘటనకు సంబంధించి మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.