: గంగూలీ బీజేపీలో చేరుతున్నారన్న వార్తలో వాస్తవం లేదు: బీజేపీ
టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బీజేపీలో చేరుతున్నారని వెలువడ్డ వార్తల్లో వాస్తవం లేదని ఆ పార్టీ స్పష్టం చేసింది. బీజేపీ జాతీయ సెక్రటరీ సిద్ధార్థ నాథ్ సింగ్ మాట్లాడుతూ, గంగూలీ బీజేపీలో చేరుతున్నారంటూ మీడియా ప్రసారం చేస్తున్న కథనాల్లో వాస్తవం లేదని అన్నారు. అయితే బీజేపీలో కొంత మంది నేతలు ఆయనతో సత్సంబంధాలు కలిగి ఉన్నారని ఆయన పేర్కొన్నారు. బీజేపీలో గంగూలీ చేరే విషయంలో ఆయనతో ఎలాంటి చర్చలు జరుపలేదని ఆయన స్పష్టం చేశారు.