: ఫిక్సింగ్ కేసులో శ్రీనివాసన్ కు క్లీన్ చిట్... బీసీసీఐ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మాత్రం సుప్రీం నో
గత ఏడాదిన్నర నుంచి కొనసాగుతున్న ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్ కు క్లీన్ చిట్ లభించింది. ఈ కేసులో శ్రీనిపై వచ్చిన ఆరోపణలకు ఆధారాలు లేవని, సాక్ష్యాలతో రుజువుకాలేదని పేర్కొంది. జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిటీ సమర్పించిన దర్యాప్తు నివేదిక ఆధారంగా కోర్టు 130 పేజీలతో తీర్పు వెలువరించింది. మరోవైపు ఇదే సమయంలో శ్రీనికి ఎదురుదెబ్బ తగిలింది. బీసీసీఐ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయవద్దని ఈ మాజీ అధ్యక్షుడిని సుప్రీం ఆదేశించింది. ఆరు నెలల్లో ఎన్నిక నిర్వహించాలని బోర్డును ఆదేశించింది. అటు చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీలకు ఐపీఎల్ నుంచి ఉద్వాసన పలికింది.