: అమ్మాయిలు చదువుకుంటేనే సమాజంలో ఉన్నతంగా జీవిస్తారు: మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ హర్యానాలోని పానిపట్ లో 'బేటీ బచావో-బేటీ పఢావో' పథకాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ... అమ్మాయిలు చదువుకుంటేనే సమాజంలో ఉన్నత జీవనం గడిపేందుకు వీలవుతుందని అభిప్రాయపడ్డారు. చదువులేకపోతే ఆడపిల్లలు ఇబ్బంది పడతారన్న విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించాలని అన్నారు. విద్య లేని అమ్మాయిలు సమస్యల పరిష్కారంలో విఫలమవుతారని తెలిపారు. లింగ వివక్ష నిర్మూలనే ధ్యేయంగా తాము ఈ పథకాన్ని ప్రవేశపెట్టామని మోదీ ఈ సందర్భంగా తెలిపారు. అమ్మాయిల రక్షణ, విద్యా బాధ్యతలు సమాజానివేనని పేర్కొన్నారు.