: తెలుగు రాష్ట్రాల్లో ఇన్నోవా, ఫార్చ్యూనర్ కొత్త వెరైటీలు
భారత వాహన మార్కెట్లో సంచలనం సృష్టించిన ఇన్నోవా విడుదలై 10 సంవత్సరాలు గడచిన సందర్భంగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సరికొత్త ఇన్నోవా, ఫార్చ్యూనర్ వేరియంట్ లను విడుదల చేసినట్టు టయోట కిర్లోస్కర్ మోటార్ లిమిటెడ్ ప్రకటించింది. ఇన్నోవా ధర ఎంచుకునే వేరియంట్ ను బట్టి రూ.12,64,400 నుంచి రూ.16,01,108 వరకూ, ఫార్చ్యూనర్ రూ.24,51,423 నుంచి రూ.25,78,423 (ఎక్స్ షోరూం, హైదరాబాద్) మధ్య లభిస్తాయని సంస్థ జనరల్ మేనేజర్ వెంకట కృష్ణన్ తెలిపారు.