: టెర్రర్ దాడుల భయంతో ముంబయిలో హై అలర్ట్
ముంబయిలో హై అలర్ట్ ప్రకటించారు. నగరంలోని సుప్రసిద్ధ సిద్ధివినాయక దేవాలయంపై దాడి జరగొచ్చని నిఘా సంస్థలు హెచ్చరించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పాకిస్థాన్ కు చెందిన జమాత్ ఉద్ దవా, లష్కరే తోయిబా, జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిదిన్ ఉగ్రవాద సంస్థలు ఇప్పటికే నాలుగు బృందాలను భారత్ కు పంపించినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ మేరకు నిఘా సంస్థలు మహారాష్ట్ర పోలీసులకు సమాచారం అందించాయి. అప్రమత్తంగా ఉండాలంటూ ముఖ్యంగా ముంబయి పోలీసు విభాగానికి సూచించాయి.