: జాతీయ క్రీడలకు క్రీడాకారుల ఎంపికపై గుత్తా జ్వాల ఆగ్రహం
జాతీయ క్రీడలకు క్రీడాకారుల ఎంపిక విధానంపై మహిళల డబుల్స్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ టీమ్ లో బెంగాల్ యువతికి చోటెందుకని, తామంతా బతికే ఉన్నామంటూ ట్వీట్ చేసింది. ఈ మేరకు "పశ్చిమబెంగాల్ కు చెందిన ఓ క్రీడాకారిణి జాతీయ క్రీడల కోసం ఎంపిక చేసిన తెలంగాణ టీమ్ లో ఉందని ఇప్పుడే విన్నాను. కానీ హైదరాబాదు క్రీడాకారిణి అయిన నా పేరు జాబితాలో ఎక్కడా లేదు. ఆశ్చర్యం వేసింది! ఎందుకిలా. అసలు అర్హత విధానం ఏమిటో తెలియదు. ఎవరు టీమ్ ను ఎంపిక చేశారో కూడా తెలియదు. అటు అశ్విని పొన్నప్ప పేరు కూడా లేదు" అని ట్విట్టర్ లో తన అసంతృప్తిని జ్వాల వెళ్లగక్కింది.