: గర్భిణీనన్న కనికరమూ లేదు... అడిషనల్ కమిషనర్ వేధిస్తున్నాడని మహిళా అధికారి హరిణి ఫిర్యాదు
తాను గర్భవతిని అన్న కనికరం కూడా లేకుండా ఉన్నతాధికారులు వేధిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ సొసైటీ డిప్యూటీ రిజిస్ట్రార్ హరిణి వాపోయారు. అడిషనల్ కమిషనర్ సురేందర్ తనను నిత్యమూ వేధిస్తున్నాడని ఆమె మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. వేధింపులపై అధికారుల ముందు ఆమె కన్నీటి పర్యంతం అయినట్టు సమాచారం. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.