: భార్యను గొడ్డలితో నరికి హతమార్చిన భర్త


మద్యం మత్తులో భార్యను భర్త గొడ్డలితో నరికి చంపిన ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. వెంగళాయపాలెం గ్రామానికి చెందిన నలుకుర్తి పుష్పరాజు మద్యం మత్తులో తన భార్య సీతారామమ్మ (50)తో ఘర్షణపడి గొడ్డలితో దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అర్ధరాత్రి సమయంలో వారి కుమారుడు విజయరాజు ఇంటికి వచ్చి చూడగా, మంచంపై తల్లి రక్తపుమడుగులో విగతజీవిగా పడి ఉంది. దీంతో విజయరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News