: కుమార్తెలు లేకుండా ఇండియాకు రానున్న ఒబామా


అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కుమార్తెలు భారత పర్యటనకు రావడం లేదు. ఈ విషయాన్ని యూఎస్ డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ బెన్ రోడ్స్ నేడు తెలిపారు. ఒబామా మూడు రోజుల భారత పర్యటనకు ఆయన సతీమణి మిచెల్ మాత్రమే వస్తున్నారని, ఆయన కుమార్తెలు మాలియా, సషాలు స్కూలు సెలవులు లేని కారణంగా రావడం లేదని వివరించారు. వీరు తమ విదేశీ పర్యటనలను వేసవిలోనే చేయాలని భావిస్తున్నారని రోడ్స్ చెప్పారు. ఆదివారం ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకలకు ఒబామా ముఖ్య అతిథిగా హాజరుకానున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News