: ఎంఎస్ నారాయణపై హెల్త్ బులెటిన్ విడుదల
ప్రముఖ హాస్యనటుడు ఎంఎస్ నారాయణ (63) ఆరోగ్య పరిస్థితిపై కొండాపూర్ కిమ్స్ వైద్యులు ఈరోజు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు, వెంటిలేటర్లు అమర్చినట్టు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయనకు డయాలసిస్ కొనసాగుతోందని కిమ్స్ వైద్యులు చెప్పారు. కొన్ని రోజుల నుంచీ ఎంఎస్ చికిత్స పొందుతున్నప్పటికీ, ఈరోజు ఆయన మరణించారంటూ వార్తలు రావడంతో తొలిసారి వైద్యులు హెల్త్ బులెటిన్ ఇచ్చారు. అటు కుటుంబసభ్యులు కూడా మీడియాలో వచ్చిన వార్తలను ఖండించిన సంగతి తెలిసిందే.