: నా పేరుపై నకిలీ ఎఫ్ బీ: చెన్నై పోలీసులకు హీరో సూర్య ఫిర్యాదు


తమిళ హీరో సూర్యకు సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ లో ఖాతా లేదు. అయితే తన పేరుపై నిర్వహిస్తున్న నకిలీ ఖాతాపై సూర్య, చెన్నై సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. "తన పేర నకిలీ ఎఫ్ బీ పేజ్ ఉందని సూర్య చెప్పారు. ఆయన ఫేస్ బుక్ లో కానీ, ట్విట్టర్ లో గానీ ఉంటే ధ్రువీకరణ చేస్తారు. భవిష్యత్తులో ఒకవేళ ఖాతా ప్రారంభించాలనుకుంటే అధికారికంగా వివరాలను అందరికీ ప్రకటిస్తారు" అని కొద్దిసేపటి క్రితం చెన్నైలో విడుదలైన ఓ ప్రకటనలో సూర్య కార్యాలయం తెలిపింది.

  • Loading...

More Telugu News