: తమిళనాడులో 'అమ్మ సిమెంట్' కు గిరాకీ
తమిళనాడు రాష్ట్రంలో 'అమ్మ సిమెంట్'కు మంచి గిరాకీ ఏర్పడింది. ధర తక్కువ కావడంతో మెజారిటీ వినియోగదారులు ఈ సిమెంటునే కొనుక్కెళుతున్నారు. పథకం ప్రారంభించిన 15 రోజుల్లో ఏకంగా లక్ష అమ్మ సిమెంట్ బస్తాలు అమ్ముడుపోయాయని ఆ రాష్ట్ర సిమెంట్ కార్పోరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇంకా 20వేల మెట్రిక్ టన్నుల సిమెంట్ ను గోడౌన్లలో ఉంచినట్టు చెప్పారు. 2013లో ఈ పథకాన్ని ప్రకటించగా, ఈ నెల 5 నుంచి అమ్మ సిమెంట్ ను అమ్ముతున్నారు. ఈ పథకం కింద ప్రైవేట్ సెక్టార్ నుంచి రెండు లక్షల టన్నుల సిమెంట్ కొనుగోలు చేసిన ప్రభుత్వం కార్పోరేషన్, మున్సిపాలిటీలు, ఇతర స్థానిక సంస్థల్లో బస్తా సిమెంట్ ను రూ.190కు అమ్ముతుంది. వాస్తవానికి చెన్నైలో సిమెంట్ బస్తా ధర రూ.360. ఈ పథకంలో కింద సిమెంట్ ధరను సగానికి సగం తగ్గించి అమ్ముతున్నారు.