: తుళ్లూరుకు రెండో దశలోనే మెట్రో రైలు...మార్చి నాటికి బెజవాడ మెట్రోకు తుదిరూపు: మెట్రో శ్రీధరన్
నవ్యాంధ్ర రాజధానిగా రూపాంతరం చెందనున్న తుళ్లూరుకు మెట్రో రైలు కాస్త ఆలస్యంగానే రానుంది. ఇప్పటికే మంజూరైన విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు మార్చిలో కాని తుదిరూపు వచ్చేలా లేదు. ఇక విశాఖకు మంజూరైన మెట్రో రైలు పరిస్థితి కూడా అంతేనట. నిన్న విశాఖలో పర్యటించిన మెట్రో శ్రీధరన్, నేడు విజయవాడలో పర్యటిస్తున్నారు. నగరంలోని బందరు రోడ్డు, ఏలూరు రోడ్లలో పర్యటిస్తున్న ఆయన బెజవాడ మెట్రో రైలుకు తుదిరూపుపై కసరత్తు చేస్తున్నారు. మార్చి నెలాఖరుకు కాని నగరంలో ఏర్పాటు కానున్న మెట్రోకు తుదిరూపు ఇవ్వలేమని ఆయన చెప్పారు. అంతేకాక తొలిదశలోనే తుళ్లూరుకు మెట్రోను విస్తరించడం ఎంతమాత్రం కుదరదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. రెండోదశ పనులు పూర్తైతేనే తుళ్లూరు మెట్రో రైలు కల సాకారమవుతుందని ఆయన చెప్పారు.