: ఆరెస్సెస్ పై అమెరికా కోర్టులో పిటిషన్


న్యూయార్క్ లోని ఫెడరల్ కోర్టులో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) పై సిక్కు హక్కుల గ్రూపు వ్యాజ్యం దాఖలు చేసింది. వెంటనే స్పందించిన న్యాయస్థానం అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీకి సమన్లు జారీ చేసింది. 60 రోజుల్లోగా ఈ పిల్ కు స్పందించాలని ఆదేశించింది. ఆర్ఎస్ఎస్ ను విదేశీ తీవ్రవాద సంస్థగా ప్రకటించాలంటూ సిక్కు హక్కుల గ్రూపు తన పిటిషన్ లో కోరింది. నియంతృత్వ సిద్ధాంతాన్ని నమ్ముతూ, పాటిస్తూ సాంస్కృతిక గుర్తింపుకోసం భారతదేశాన్ని హిందూ దేశంగా మార్చేందుకు ఆరెస్సెస్ నేతలు యత్నిస్తున్నారని సిక్కు గ్రూపు ఆరోపిస్తోంది. ఆరెస్సెస్ మత మార్పిడులపైనా ఆ గ్రూపు ఆగ్రహం వ్యక్తం చేసింది. క్రిస్టియన్లు, ముస్లింలను బలవంతంగా హిందూ మతంలోకి మారుస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తోందని మండిపడింది.

  • Loading...

More Telugu News