: టికెట్ ఇవ్వలేదని వెబ్ సైట్ ఎత్తుకెళ్లాడు!


అసెంబ్లీ స్థానానికి పోటీ చేసేందుకు ఉత్సాహం ప్రదర్శించి భంగపడ్డ నేతలు తమకు తోచిన విధంగా పార్టీకి చేటుచేసేందుకు ప్రయత్నిస్తుంటారు. అలాంటి ఘటనే కాంగ్రెస్ పార్టీకి ఎదురైంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సీటు ఆశించి భంగపడ్డ సంజయ్ పూరీ ఏకంగా వెబ్ సైట్ ను పనిచేయకుండా చేసేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన dpcc.co.in, congresssandesh.com వెబ్ సైట్లను పార్టీ తరపున నిర్వహిస్తున్న సంజయ్ పూరి, ఢిల్లీ జనక్ పురి నుంచి పోటీ చేసేందుకు ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. అతనికి టికెట్ కేటాయించకపోవడంతో ఆయా వెబ్ సైట్లకు సంబంధించిన సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ సమాచారం మొత్తం తనతోపాటు తీసుకెళ్లిపోయారు. దీంతో వెబ్ సైట్లలో సమాచారం ఏదీ రావడం లేదు. దీని గురించి సంజయ్ ను అడిగితే తాను రూపొందించిన వెబ్ సైట్లను తాను తీసుకెళ్లడం తప్పెలా అవుతుందని ఎదురు ప్రశ్నించారు. కాంగ్రెస్ తనకు టికెట్ ఇవ్వనప్పటికీ రెబెల్ గా పోటీ చేస్తానని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News