: తిరుపతిలో విషాదం... ఎస్వీ వర్సిటీ హాస్టల్ లో పీజీ విద్యార్థిని ఆత్మహత్య


తిరుపతిలో నేటి తెల్లవారుజామున విషాదం చోటుచేసుకుంది. నగరంలోని శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం మహిళల వసతి గృహంలో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. వర్సిటీలో ఎంకామ్ సెకండియర్ చదువుతున్న వైష్ణవి హాస్టల్ లోని తన గదిలో ఉరేసుకుని బలవన్మరణం చెందింది. విషయాన్ని గమనించిన మిగతా విద్యార్థులు వర్సిటీ అధికారులకు సమాచారాన్ని చేరవేశారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన హాస్టల్ కు చేరుకుని ఈ ఘటనపై విచారణ మొదలుపెట్టారు. వైష్ణవి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. వైష్ణవి స్వస్థలం నెల్లూరు జిల్లా రావురుగా పోలీసులు గుర్తించారు. ఈ సంఘటన వర్సిటీ విద్యార్థులను కలవరానికి గురి చేసింది.

  • Loading...

More Telugu News