: ఐపీఎల్ మీడియా హక్కుల కోసం టెండర్లు పిలిచిన బీసీసీఐ
రాబోయే ఐపీఎల్ సీజన్లకు సంబంధించి మీడియా హక్కుల కోసం బీసీసీఐ టెండర్లకు ఆహ్వానం పలికింది. పెప్సీ స్పాన్సర్ చేస్తున్న ఐపీఎల్ పోటీలు అందుబాటులో ఉన్న ప్రతి మాధ్యమం ద్వారా ప్రసారమవుతాయని బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ తెలిపారు. టెండర్లకు సంబంధించి ఐటీటీ డాక్యుమెంట్ ముంబయి వాంఖెడే స్టేడియంలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో అందుబాటులో ఉంటుందని ఓ ప్రకటనలో తెలిపారు. బిడ్లు వేయడానికి ఆఖరి తేదీ ఫిబ్రవరి 3. బీసీసీఐ మార్కెటింగ్ సమావేశంలో బిడ్లు పరిశీలించిన పిదప టెండర్ అప్పగిస్తారు. డిజిటల్ మీడియాకు విశేష ప్రజాదరణ లభిస్తుండగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్ లలో మ్యాచ్ లను వీక్షించేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో, బీసీసీఐ టెలివిజన్ ప్రసార హక్కులే కాకుండా, ఇంటర్నెట్ స్ట్రీమింగ్, మొబైల్ స్ట్రీమింగ్ పేరిట హక్కులను విక్రయిస్తూ, సొమ్ము చేసుకుంటోంది.