: మోదీ, చంద్రబాబు పిలుపుకు స్పందించిన సిలికానాంధ్ర
గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలంటూ ప్రజాప్రతినిధులకు, ప్రముఖులకు ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. వారి పిలుపుకు అమెరికాలోని ప్రముఖ తెలుగు సంఘం సిలికానాంధ్ర స్పందించింది. ఈ మేరకు తాము కూచిపూడి గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్టు సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్ తెలిపారు. సిలికానాంధ్ర సభ్యులు కూచిపూడి గ్రామాభివృద్ధికి పాటుపడతారని వివరించారు. కృష్ణాజిల్లాలోని కూచిపూడి గ్రామం కూచిపూడి నాట్యకళకు పుట్టినిల్లన్న సంగతి తెలిసిందే.