: కేజ్రీవాల్ ఆస్తులు తరగగా, కేసులు మాత్రం పెరిగాయి!
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆస్తులు తరగగా, కేసులు మాత్రం పెరిగాయి. తన వివరాలు పేర్కొంటూ ఈసీకి ఎన్నికల అఫిడవిట్ కేజ్రీవాల్ అందజేశారు. అందులో గత ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న వివరాలకు, ఇప్పటి ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న వివరాలకు మధ్య వ్యత్యాసం కనిపించింది. గత ఎన్నికల్లో ఆయన, ఆయన భార్యపేరిట 2.09 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్టు పేర్కొనగా, తాజా ఎన్నికల అఫిడవిట్లో 5 లక్షల రూపాయలు తగ్గినట్టు చూపారు. ఇదే సమయంలో తనపై పలు కోర్టుల్లో కేసులు నడుస్తున్నట్టు తెలిపారు. అయితే తాను నేరం చేయలేదని, అవన్నీ ఆరోపణల ఆధారంగా నమోదైన కేసులని ఆయన స్పష్టం చేశారు.