: ఫోరెన్సిక్ పరిశీలనకు సునంద పుష్కర్ ఫోన్, ల్యాప్ టాప్
కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ భార్య సునంద పుష్కర్ హత్య కేసు వెనుకనున్న మిస్టరీని ఛేదించేందుకు ఢిల్లీ పోలీసులు శ్రమిస్తున్నారు. ఈ కేసును ఛేదించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం శశిథరూర్ ను ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఈ దర్యాప్తులో భాగంగా సునంద పుష్కర్ ఫోన్, ల్యాప్ టాప్ లను దర్యాప్తు బృందం స్వాధీనం చేసుకుంది. వీటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపింది. ఇందులోని వివరాలను పరిశీలించిన తరువాత, హత్య మిస్టరీ వీడే అవకాశం ఉందని ఢిల్లీ పోలీసులు తెలిపారు.