: 'గోపాల గోపాల'పై హైకోర్టులో కేసు
పవన్ కల్యాణ్, వెంకటేశ్ కాంబినేషన్లో వచ్చిన 'గోపాల గోపాల' చిత్రాన్ని ఇంకా వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. సినిమా విడుదలకు ముందే హిందుత్వ పార్టీలు ఈ సినిమాపై విరుచుకుపడ్డాయి. సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వొద్దంటూ ధర్నాలు కూడా చేపట్టాయి. సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలున్నాయంటూ, సినిమా విడుదలను అడ్డుకునేందుకు ప్రయత్నించాయి. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఈ చిత్రం ఉందంటూ వీహెచ్ పీ గళమెత్తడం తెలిసిందే. తాజాగా, 'గోపాల గోపాల' చిత్ర ప్రదర్శన ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేయాలంటూ హైకోర్టులో కేసు దాఖలైంది. హైదరాబాదుకు చెందిన రఘునాథరావు అనే వ్యక్తి ఈ కేసు దాఖలు చేశారు.