: కిరణ్ బేడీ బీజేపీలో చేరడంపై మాట్లాడేందుకు హజారే నిరాకరణ


సన్నిహితురాలు, మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ భారతీయ జనతా పార్టీలో చేరడంపై అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నా హజారే మౌనం పాటిస్తున్నారు. బేడీ విషయంలో మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు. "దీని గురించి మాట్లాడాలని నేననుకోవడంలేదు. అంతేకాదు, కిరణ్ బేడీ విషయంపైన కామెంట్ చేయను. రాజకీయాలు దుర్మార్గమైనవి" అన్నారు. గతంలో హజారే నేతృత్వంలో చేపట్టిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో బేడీ కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం కమల తీర్థం పుచ్చుకుని, ఆ పార్టీ తరపున ఢిల్లీ సీఎం అభ్యర్థిగా బరిలో ఉన్నారు.

  • Loading...

More Telugu News