: మన్మోహన్ నోరు విప్పితేనే దేశానికి మంచిది: సుబ్రహ్మణ్య స్వామి


మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నోరు విప్పి అన్ని విషయాలు మాట్లాడితేనే దేశానికి మేలు జరుగుతుందని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. ఆయనకు నిజాయతీపరుడిగా పేరుందని, వాస్తవాలు చెబితే దేశానికి ఉపకారం చేసిన వారవుతారని పేర్కొన్నారు. బొగ్గు కుంభకోణంలో హిందాల్కో సంస్థకు బొగ్గు క్షేత్రాలు కేటాయించిన కేసులో మన్మోహన్ ను సీబీఐ విచారించిందంటూ వచ్చిన వార్తల నేపథ్యంలో స్వామి పైవిధంగా స్పందించారు. పది సంవత్సరాల పాటు మన్మోహన్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో బొగ్గు కుంభకోణం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అప్పట్లో ఆయన బొగ్గు శాఖను పర్యవేక్షించారు.

  • Loading...

More Telugu News