: పెళ్లికూతురు కాబోతున్న బాలీవుడ్ నటి సోహా అలీఖాన్


బాలీవుడ్ నటి, సైఫ్ అలీఖాన్ సోదరి సోహా అలీఖాన్ పెళ్లి కూతురు కాబోతుంది. నటుడు కునాల్ ఖేమూను ఆమె పెళ్లాడబోతోంది. ఈ నెల 25న వారి వివాహం జరగనుంది. ఈ విషయంపై సోహా మాట్లాడుతూ, "నా వివాహం మా ఇంట్లోనే చాలా నిరాడంబరంగా జరగనుంది. పెళ్లికి ఏ రంగు దుస్తులు వేసుకోవాలన్న దానిపై ఇంకా నిర్ణయించుకోలేదు. ఈ విషయంలో చాలా అయోమయంలో ఉన్నా. కానీ, నా డ్రెస్సింగ్ మాత్రం చాలా ప్రత్యేకంగా, గుర్తుండిపోయేలా ఉంటుంది" అంటూ ఈ ముద్దుగుమ్మ చెప్పుకొచ్చింది. కొన్నేళ్లుగా ప్రేమాయణం కొనసాగిస్తున్న సోహా, కునాల్ లు గతేడాది డిసెంబర్ 31న నిశ్చితార్థం చేసుకున్నారు. అన్నట్టు హిందీ సీనియర్ నటి షర్మిళా ఠాగోర్, క్రికెటర్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీలు ఆమె తల్లిదండ్రులు.

  • Loading...

More Telugu News