: స్వైన్ ఫ్లూపై కేసీఆర్ సమీక్ష... సాయంత్రంలోగా రాష్ట్రానికి రానున్న 50 వేల స్వైన్ ఫ్లూ కిట్లు


పంజా విసురుతున్న స్వైన్ ఫ్లూ వ్యాధిపై అధికారులతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా, స్వైన్ ఫ్లూ సోకిన వారందరికీ వ్యాక్సిన్లు ఇవ్వాలని నిర్ణయించారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోని ప్రజలకు స్వైన్ ఫ్లూపై అవగాహన కల్పించనున్నారు. అంతేకాకుండా, జీహెచ్ఎంసీలో జోన్లవారీగా స్పెషల్ ఆఫీసర్లను నియమించనున్నారు. జిల్లాల వారీగా మంత్రులు స్వైన్ ఫ్లూపై సమీక్ష నిర్వహించాలని కేసీఆర్ ఆదేశించారు. మరోవైపు, ఈ సాయంత్రంలోగా 50 వేల స్వైన్ ఫ్లూ కిట్లను కేంద్ర ప్రభుత్వం హైదరాబాదుకు పంపుతోంది.

  • Loading...

More Telugu News