: మా పార్టీలో సంక్షోభం లేదు... అదంతా గిట్టని వారి దుష్ప్రచారమే: రాజ్ నాథ్


ఢిల్లీ బీజేపీలో సంక్షోభం తలెత్తిందన్న వార్తలపై ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పందించారు. పార్టీలో ఎలాంటి సంక్షోభం లేదని... గిట్టనివారే ఇలాంటి దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. అలాంటి పార్టీలకు ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. ఢిల్లీ ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలో తమ పార్టీకి బాగా తెలుసని... ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న బీజేపీకి ఇది పెద్ద సమస్య కాదని చెప్పారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడం ఖాయమని తెలిపారు.

  • Loading...

More Telugu News