: పేర్లు ఎందుకు? డబ్బు తేవటం ముఖ్యం... నల్లధనంపై సుప్రీంకోర్టు


విదేశాల్లో నల్ల ధనాన్ని దాచుకున్న వారి పేర్లు బయటకు చెప్పడం కన్నా, ఆ డబ్బు వెనక్కు తీసుకురావడమే ముఖ్యమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. వారి పేర్లు వెల్లడించాల్సిన అవసరం లేదని పేర్కొంది. విదేశాల్లో అక్రమ ఖాతాలున్న వారి పేర్లను వెల్లడించాలని కోరుతూ న్యాయవాదులు రామ్‌ జెఠ్మలానీ, ప్రశాంత్‌ భూషణ్‌లు వేసిన పిటిషన్లను విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్.ఎల్.దత్తు నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు స్పష్టం చేసింది. అంతకుముందు విచారణ సందర్భంగా న్యాయవాది అనిల్‌ దివాన్ తన వాదనలు వినిపించారు. గత ఆరు నెలల్లో ఒక్క రూపాయి కూడా ఈ దేశానికి తిరిగిరాలేదని, కేవలం కొన్ని సోదాలు, అటాచ్‌మెంటులు మాత్రమే జరిగాయని ఆయన గుర్తు చేశారు. వారి పేర్లు ప్రచురిస్తే, విదేశాల్లో నల్లధనం దాచుకోవాలనే మరింత మందికి హెచ్చరికగా పనిచేస్తుందని వివరించారు. వాదనలు విన్న తరువాత, ఖాతాదారుల పేర్లను బహిర్గతపరచాలని తాము ఆదేశాలు ఇవ్వబోమని, నల్లధనాన్ని వెనక్కు తేవటం ముఖ్యమని సుప్రీం పేర్కొంది.

  • Loading...

More Telugu News