: పార్టీ ఫిరాయింపులపై తెలంగాణ ఏజీకి హైకోర్టు నోటీసులు
టీడీపీ నుంచి ఇటీవల టీఆర్ఎస్ లో చేరిన నేతల విషయంలో ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు తెలంగాణ అడ్వొకేట్ జనరల్ కు నోటీసులు జారీ చేసింది. టీడీపీని వీడి టీఆర్ఎస్ లో చేరిన తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, ఎమ్మెల్యేలు ధర్మారెడ్డి, తీగల కృష్ణారెడ్డిలపై అనర్హత వేటు వేయాలని టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకరరావు, ఉపనేత రేవంత్ రెడ్డిలు దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు నేడు విచారణకు స్వీకరించింది. ఈ విషయంలో ప్రభుత్వ స్పందన తెలియజేయాలంటూ తెలంగాణ అడ్వొకేట్ జనరల్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కేసు విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది.