: కేసీఆర్ ఫ్యామిలీ వ్యాపార భాగస్వాములంతా ఆంధ్రోళ్లే: రేవంత్ రెడ్డి
తెలంగాణ సీఎం కేసీఆర్ పై టీ టీడీపీ నేత, టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డి మరోమారు విరుచుకుపడ్డారు. కేసీఆర్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో నడుస్తున్న వ్యాపారాల్లో భాగస్వాములుగా కొనసాగుతున్నవారంతా ఆంధ్రా ప్రాంతానికి చెందినవారేనని ఆయన ఆరోపించారు. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి... కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు తమ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై చేస్తున్న వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబును టీఆర్ఎస్ నేతలు అనవసరంగా వివాదాల్లోకి లాగుతున్నారని ఆయన మండిపడ్డారు.