: మిచెల్లీ ఒబామాకు వంద సిల్క్ చీరలను బహుమతిగా ఇవ్వనున్న మోదీ


అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, సతీమణి మిచెల్లీలకు భారత్ పర్యటన సమయంలో కేంద్ర ప్రభుత్వం పలు బహుమతులను అందివ్వనుంది. తాజా సమాచారం ప్రకారం, మిచెల్లీకి 100 బనారసీ చీరలు, బనారసీ సిల్క్ డ్రెస్ మెటీరియల్ లను ఇవ్వనున్నారట. మిచెల్లీకి భారతీయ సిల్క్ అంటే ఎంతో ఇష్టమన్న సంగతి తెలిసిందే. పలు అంతర్జాతీయ కార్యక్రమాల్లో యూఎస్ మొదటి మహిళ అయిన ఆమె జాక్వెర్డ్ సిల్క్ డ్రెస్సుల్లో కనిపించారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి కార్యాలయానికి వంద బనారసీ సిల్క్ చీరలు కావాలని మోదీ సొంత నియోజకవర్గం వారణాసి బీజేపీ నేతలకు చెప్పారట. "పాత బనారసీ, ప్రత్యేకంగా డిజైన్ చేసిన మంచి పట్టు చీరలు, అత్యుత్తమ నాణ్యత గల బనారసీ డ్రెస్ మెటీరియల్ లను మిచెల్లీ ఒబామా న్యూఢిల్లీ వచ్చిన సమయంలో ఇవ్వనున్నాం" అని వారణాసి బీజేపీ సీనియర్ నేత ఒకరు వెల్లడించారు.

  • Loading...

More Telugu News