: సరికొత్త రికార్డును తాకిన సెన్సెక్స్... రూ. లక్ష కోట్లు దాటిన మార్కెట్ సంపద


నిన్న నిఫ్టీ ఆల్ టైం రికార్డును తాకగా, నేడు సెన్సెక్స్ సరికొత్త రికార్డు నమోదు చేసింది. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలంగా ఉండటంతో సెషన్ ఆరంభంలోనే కొనుగోళ్ళు వెల్లువెత్తాయి. ఉదయం 10 గంటల సమయంలో సెన్సెక్స్ 28,943 పాయింట్ల ఆల్ టైం రికార్డును తాకింది. మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో 28,910 పాయింట్ల వద్ద వున్న సెన్సెక్స్ క్రితం ముగింపుతో పోలిస్తే 125 పాయింట్ల లాభంలో కొనసాగుతోంది. కాగా, బీఎస్ఈలో ముదుపర్ల సంపద మరోసారి లక్ష కోట్ల రూపాయలను అధిగమించింది.

  • Loading...

More Telugu News