: కాకా మరణం దళితులకు తీరని నష్టం: దత్తాత్రేయ


అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన వ్యక్తి, కార్మికుల పక్షాన పోరాడిన నేత దివంగత వెంకటస్వామి అని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ కొనియాడారు. ఈ రోజు హైదరాబాదులోని రవీంద్రభారతిలో జరిగిన కాకా సంస్మరణ సభలో దత్తాత్రేయ మాట్లాడారు. కాకా మరణం దళితులకు తీరని లోటని, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన ఎంతో శ్రమించారని అన్నారు. కాకా నిలువెత్తు విగ్రహాన్ని హైదరాబాదులో ఏర్పాటు చేయాలని టీఎస్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమానికి టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు పలువురు నేతలు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News