: భారత్ పై ‘బ్యాట్’ దాడులకు పాక్ సన్నాహాలు!


నిత్యం భారత్ పై కాలుదువ్వుతున్న పాకిస్థాన్ తాజాగా ‘బ్యాట్’ దాడులకు శ్రీకారం చుడుతోందట. అసలు ఈ బ్యాట్ అంటే ఏమిటనేగా మీ సందేహం. బ్యాట్ అంటే క్రికెట్ బ్యాట్ కాదు. ‘బోర్డర్ అటాకింగ్ టీం’ (సరిహద్దు దాడుల బృందం) పేరిట సుశిక్షిత సైనికులతో పాక్ సైన్యం కొత్తగా ఏర్పాటు చేస్తున్న ముఠాలు. ఈ బృందాలు పాక్ లోని ఉగ్రవాద మూకలతో కలిసి భారత్ పై దాడులకు పాల్పడటమే ప్రధాన కర్తవ్యంగా రంగంలోకి దిగనున్నాయట. అంతేకాక భారత స్థావరాలపై ముందుగా దాడులు చేయడం ద్వారా సైన్యం దృష్టి మరల్చి, ఉగ్రవాద మూకలను భారత భూభాగంలోకి ప్రవేశించేలా చేయడమే లక్ష్యంగా పాక్ వీటిని రంగంలోకి దించుతోందట. ఈ మేరకు జమ్మూ కాశ్మీర్ లోని ప్రధాన రక్షణ కేంద్రాలు, గస్తీ బృందాలకు భారత నిఘా వర్గాలు సమాచారమందించాయి. బ్యాట్ దాడులపై నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో భాతర సైన్యం నియంత్రణ రేఖ వెంట భద్రతను కట్టుదిట్టం చేసింది. నియంత్రణ రేఖ సమీప గ్రామాల ప్రజలను కూడా అప్రమత్తం చేసినట్లు సైనిక ప్రతినిధి కల్నల్ ఎస్డీ గోస్వామి చెప్పారు.

  • Loading...

More Telugu News