: ఈ రహదారి... సీతారాములను కలుపుతుందట!


నిజమేనండోయ్, కేంద్ర ప్రభుత్వం నిర్మించతలపెట్టిన ఈ రహదారి రామయ్యను సీతమ్మతో కలుపుతుందట. వివరాల్లోకెళితే... ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య రాములోరి జన్మస్థలమైతే, నేపాల్ లోని జనక్ పూర్ సీతమ్మ జన్మస్థలమని చరిత్ర చెబుతోంది. ఈ రెండు ప్రాంతాలను కలిపేందుకు ఓ రహదారిని నిర్మించేందుకు నరేంద్ర మోదీ సర్కారు తీర్మానించింది. ‘రామ్-జానకి మార్గ్’ గా పేరు పెట్టిన ఈ రహదారి నిర్మాణానికి రూ.2 వేల కోట్లను ఖర్చు చేయనున్నట్లు కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. వివాహం తర్వాత సీతారాములు ఈ దారి మీదుగానే అయోధ్య చేరుకున్నారని రామాయణం చెబుతోంది.

  • Loading...

More Telugu News