: కాకా సంస్మరణ సభకు హాజరైన కేసీఆర్, దత్తాత్రేయ
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దివంగత వెంకటస్వామి (కాకా) సంస్మరణ సభ హైదరాబాదులోని రవీంద్రభారతిలో జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. ఈ సందర్భంగా కాకా చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆనందభాస్కర్, వి.హనుమంతరావు, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, సీపీఐ నేతలు సురవరం సుధాకర్ రెడ్డి, నారాయణ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.