: అమెరికా భవిష్యత్తు ఇండియాతో ముడిపడి వుంది... భారత్ పర్యటనకు ముందు ఒబామా ప్రసంగం


అమెరికా మరింత బలోపేతం కావాలంటే భారత్ వంటి దేశాలు మంచి వృద్ధి రేటును నమోదు చేయాలని బరాక్ ఒబామా వ్యాఖ్యానించారు. మరో 5 రోజుల్లో భారత్ పర్యటనకు బయలుదేరనున్న ఆయన అమెరికన్లను ఉద్దేశించి కాంగ్రెస్ లో కీలక ప్రసంగం చేశారు. ఆర్థిక సంక్షోభానికి ముందున్న పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత తరుణంలో అభివృద్ది చెందుతున్న దేశాల జీడీపీ పెరుగుదల ముఖ్యమని ఆయన అన్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందని, కొత్త ఉద్యోగ సృష్టి సంతృప్తికరంగా వుందని పేర్కొన్నారు. భారత గణతంత్ర దినోత్సవానికి ఒబామా ప్రత్యేక అతిథిగా హాజరు అవుతున్న విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News