: ఇళయరాజా ముందు పాడే ధైర్యం ఎప్పుడూ చేయలేదు: అమితాబ్


ప్రఖ్యాత స్వరకర్త ఇళయరాజా సంగీత దర్శకుడిగా వెయ్యి చిత్రాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ముంబయిలో 'షమితాబ్' చిత్రం మ్యూజిక్ లాంఛ్ వేడుకలో ఆయనకు ఘన సన్మానం జరిగింది. ఈ కార్యక్రమానికి సీనియర్ నటుడు అమితాబచ్చన్, రజనీకాంత్, కమల్ హాసన్, శ్రీదేవి హాజరయ్యారు. మ్యూజిక్ మాస్ట్రో ముందు పాడే ధైర్యం తానెప్పుడూ చేయలేదని బిగ్ బి ఈ సందర్భంగా అన్నారు. "ఆయన ముందు పాడే ధైర్యం నేనెప్పుడూ చేయలేదు. ఎందుకంటే అది చాలా చాలా ఇబ్బందికరంగా ఉంటుందనుకుంటున్నా. అందుకే ప్రతిసారీ రికార్డింగ్ సమయంలో స్టూడియోలో విడిగా కూర్చుంటా ('పా' చిత్రంలో ఓ పాట పాడినప్పటి సందర్భాన్ని బిగ్ బి గుర్తు చేసుకున్నారు). అదెంత భయపెడుతుందో చెప్పలేను" అని పేర్కొన్నారు. ఇదే సమయంలో ఇళయ రాజీజీ ఓ జీనియస్ అని బిగ్ బి అభివర్ణించారు.

  • Loading...

More Telugu News