: స్వైన్ ఫ్లూను తెలంగాణ నుంచి తరిమికొడతాం: రాజయ్య
తెలంగాణలో స్వైన్ ఫ్లూ డేంజర్ బెల్స్ మోగించడంతో టీఎస్ ప్రభుత్వం అలర్ట్ అయింది. ఈ క్రమంలో టీఎస్ డిప్యూటీ సీఎం, ఆరోగ్య శాఖ మంత్రి రాజయ్య మాట్లాడుతూ, స్వైన్ ఫ్లూను తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమికొడతామని చెప్పారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ స్వైన్ ఫ్లూపై యుద్ధం ప్రకటించారని తెలిపారు. కేంద్రం నుంచి ప్రత్యేక బృందాలను పంపాలని ప్రధాని మోదీకి సీఎం విన్నవించారని చెప్పారు. కేంద్ర బృందాలతో కలసి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు పని చేస్తారని తెలిపారు.