: 5 లక్షలు కొట్టు... 5 కోట్లు పట్టు: ఆదిలాబాద్ లో దొంగబాబా చేతివాటం!


ఐదు లక్షలు కొట్టు... ఐదు కోట్లు పట్టు. ఇదేదో చిట్ ఫండ్ సంస్థ మాయాజాలం అనుకుంటే పొరబడినట్టే. ఎందుకంటే, ఈ కొత్త తరహా చేతివాటానికి తెరతీసిన వ్యక్తి ఓ దొంగబాబా. ఆదిలాబాద్ జిల్లా హత్నూర మండలంలో ఈ ఘటన వెలుగు చూసింది. ఐదు లక్షలిస్తే, ఐదు కోట్లిస్తానని చెబుతూ ఆ దొంగబాబా తనవద్దకు వస్తున్న భక్తులను బురిడీ కొట్టించాడు. ఇలా సదరు దొంగబాబా చేతిలో మోసపోయిన ఓ భక్తుడు ఇచ్చిన ఫిర్యాదుతో రంగప్రవేశం చేసిన పోలీసులు దొంగబాబాకు అరదండాలేశారు. ప్రస్తుతం తమ అదుపులో ఉన్న దొంగబాబా ఘనకార్యాల గురించి పోలీసులు కూపీ లాగుతున్నారు.

  • Loading...

More Telugu News