: గవర్నర్ నరసింహన్ టెలిఫోన్ లైన్ హ్యాకింగ్!
గవర్నర్ నరసింహన్ నివాస సముదాయమైన రాజ్‌భవన్లో ఓ టెలిఫోన్ లైన్ హ్యాకింగ్ కు గురైంది. ఆ ఫోన్ బిల్లు అధికంగా రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఫోన్ నెంబర్ ను హ్యాక్ చేసిన కొందరు ఒమన్, శ్రీలంక దేశాల్లోని నెంబర్లకు భారీగా కాల్స్ చేశారని అధికారులు గుర్తించారు. హ్యాకింగ్ పై సీఐడీ అధికారులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. విచారణ కోసం కొందరు అధికారులు ఒమన్, శ్రీలంక దేశాలకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. సాక్ష్యాత్తూ గవర్నర్ ఇంట్లోని ఫోన్ హ్యాకింగ్ కు గురికావడం సంచలనం సృష్టించింది.