: ఫిబ్రవరి 2 నుంచి సికింద్రాబాద్ - గుంటూరు మధ్య పలు రైళ్ల వేళల్లో మార్పులు


నడికుడి-బీబీనగర్ మధ్య వంతెన నిర్మాణం కారణంగా వచ్చే నెల 2 నుంచి పలు రైళ్ల రాకపోకల్లో మార్పులు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఇందులో భాగంగా శబరి ఎక్స్‌ప్రెస్‌ను కాజీపేట-న్యూ గుంటూరు మీదుగా, జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ను విజయవాడ-కాజీపేట మీదుగా మళ్లించనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య పౌర సంబంధాల అధికారి కె.సాంబశివరావు తెలిపారు. సికింద్రాబాద్-రేపల్లె ఫాస్ట్ పాసింజర్ రైలు నల్గొండ వరకు, రేపల్లె-సికింద్రాబాద్ రైలు మిర్యాలగూడ వరకు పరిమితం చేయనున్నట్లు వెల్లడించారు. కాగా, ప్రయాణికుల రద్దీ దృష్ట్యా గౌహతి-త్రివేండ్రం సెంట్రల్ మధ్య 2 ప్రత్యేక రైళ్లు నడవనున్నాయని, ఇవి ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, గూడూరు మీదుగా రాకపోకలు సాగిస్తాయని తెలిపారు. ఈ రైలు 26న (సోమవారం) రాత్రి 11.25 గంటలకు గౌహతిలో బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో రైలు త్రివేండ్రం సెంట్రల్‌లో జనవరి 30న (శుక్రవారం) మధ్యాహ్నం 12గంటలకు బయలుదేరుతుందని చెప్పారు.

  • Loading...

More Telugu News