: ఇమ్రాన్ ఖాన్ పై 20 బిలియన్ల పరువునష్టం దావా
పాకిస్థాన్ క్రికెట్ మాజీ కెప్టెన్, తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ పై పరువునష్టం దావా దాఖలైంది. పాక్ మాజీ చీఫ్ జస్టిస్ ఇఫ్తికార్ చౌదరి ఈ దావా వేశారు. 2013 సాధారణ ఎన్నికల్లో రిగ్గింగ్ కు పాల్పడినట్టు తనపై ఇమ్రాన్ ఆరోపణలు చేశారని... దీంతో తన పరువు, ప్రతిష్ఠలకు భంగం వాటిల్లిందని చౌదరి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన స్థానిక జిల్లా కోర్టులో రూ. 20 బిలియన్ల పరువు నష్టం దావా వేశారు. కేసును స్వీకరించిన కోర్టు ఈ నెల 29న కోర్టు ముందు హాజరుకావాలని ఇమ్రాన్ ను ఆదేశించింది.