: నేను రక్తం ఇస్తా... ఆపరేషన్ చేయండి: బాపట్ల వైద్యులతో ఎమ్మెల్యే కోన రఘుపతి
ఓ గర్భిణి శస్త్రచికిత్స కోసం అవసరమైతే తన రక్తం ఇస్తానని బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి వైద్యులకు చెప్పారు. "నాకు ఆపరేషన్ చేయరంట, నాకు తగ్గ రక్తం లేదట. నన్ను గుంటూరు వెళ్లమంటున్నారు’ అంటూ గణపవరానికి చెందిన గర్భిణి అన్నామణి తన బాధను కోన రఘుపతి ఎదుట వెళ్లబోసుకుంది. బీ పాజిటివ్ బ్లడ్ లేకపోవటంతో గుంటూరు వెళ్లాలని వైద్యులు ఆమెకు సూచించినట్టు ఆయన తెలుసుకుని ‘నాది బీ పాజిటివ్ బ్లడ్.. నా బ్లడ్ తీసుకుని ఆపరేషన్ ప్రారంభించండి’ అని వైద్యులను కోరారు. ఆసుపత్రిలో అభివృద్ధి పనుల పరిశీలనకు ఆయన వచ్చినప్పుడు ఈ ఘటన జరిగింది. చివరకు ఎమ్మెల్యే చొరవతో గుంటూరులోని బ్లడ్‌బ్యాంకు నుంచి ఆఘమేఘాలమీద రక్తం తెప్పించి వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేశారు. తల్లీ బిడ్డా క్షేమంగా వున్నారని డాక్టర్లు తెలిపారు.