: ఎప్పుడు హత్య చేశారో..? ఒకేచోట 26 మృతదేహాలు లభ్యం!


ఉగ్రవాద సంస్థల అరాచకాలు మరింతగా పెరుగుతున్నాయి. ఎప్పుడు హత్య చేశారో? ఏమో? తాజాగా ఉత్తర ఇరాక్ పరిధిలోని సాదీయ జిల్లా గ్రామీణ ప్రాంతంలో 26 మృతదేహలను సైనికులు గుర్తించారు. వీరిలో 15 మంది ప్రజలు, 11 మంది కుర్దిష్ సైనికులు వున్నారని గుర్తించినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ఈ ఘాతుకం ఐఎస్ ఉగ్రవాదుల పనే అని అనుమానిస్తున్నారు. ఈ 26 మందిని ఆపహరించి సామూహికంగా హత్య చేసి ఉంటారని ఓ అధికారి వివరించారు. దేశంలో గల్లంతవుతున్న వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతుండటంతో, సైనిక దళాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలోనే మృతదేహాల కుప్పను భద్రతా దళాలు కనిపెట్టాయి. 2014 జూన్ నుంచి ఇరాక్ లో సైన్యానికి, ఉగ్రవాదులకు జరుగుతున్న పోరులో వందల సంఖ్యలో సామాన్య పౌరులు మరణించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News