: కేసీఆర్ సతీమణికి వైరల్ ఫీవర్... యశోద ఆస్పత్రిలో చికిత్స!


తెలంగాణ సీఎం కేసీఆర్ సతీమణి శోభ అస్వస్థతకు గురయ్యారు. వైరల్ ఫీవర్ తో ఆమె బాధపడుతున్నట్లు వైద్యులు తేల్చారు. ప్రస్తుతం ఆమె హైదరాబాదులోని సోమాజిగూడ యశోద సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని యశోద వైద్యులు తెలిపారు. శోభ ఆరోగ్య పరిస్థితిపై ఆమె భర్త కేసీఆర్, కొడుకు కేటీఆర్, కూతురు కవిత నిత్యం వైద్యులతో మాట్లాడుతున్నారు. టీఆర్ఎస్ నేతలు హరీశ్వర్ రావు, కొప్పుల ఈశ్వర్ లు శోభ ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

  • Loading...

More Telugu News