: హైదరాబాదులో శరవేగంగా విస్తరిస్తున్న స్వైన్ ఫ్లూ... పరిస్థితిపై కేంద్రం ఆరా!
హైదరాబాదులో ప్రాణాంతక వ్యాధి స్వైన్ ఫ్లూ శరవేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే 300 మందికిపైగా సోకిన ఈ వ్యాధి 24 మందిని పొట్టనబెట్టుకుంది. రోగులకు చికిత్సలు అందిస్తున్న ముగ్గురు వైద్యులకు కూడా ఈ వ్యాధి సోకింది. గడచిన 24 గంటల్లోనే 50 మందికి కొత్తగా వ్యాధి నిర్ధారణ అయినట్లు విశ్వసనీయ సమాచారం. మరోవైపు ఈ వ్యాధి బారిన పడిన ముగ్గురు వ్యక్తులు మంగళవారం మృత్యువాత పడ్డారు. దీంతో నగరంలో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఇదిలా ఉంటే,. హైదరాబాదులో విస్తరిస్తున్న స్వైన్ ఫ్లూపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. వ్యాధి విస్తరణ, ఆస్పత్రుల్లో సౌకర్యాలు, మృతుల సంఖ్య తదితరాలపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తెలుగు రాష్ట్రాల వైద్యాధికారులతో మాట్లాడారు. వ్యాధి నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కేంద్రం రాష్ట్రాలకు సూచించింది.