: ఆస్తిలో వాటా నిరాకరించాడని స్వామీజీపై కక్ష తీర్చుకుంది!


వివాహేతర సంబంధం నేపథ్యంలో మరో దారుణం చోటు చేసుకుంది. కర్ణాటకలోని యలుబుర్గి ప్రాంతంలోని మటికట్టి గ్రామంలో కొప్పళ మఠం కొలువుదీరి ఉంది. శివానంద స్వామీజీ ఆ మఠానికి అధిపతి. ఆ మఠంలోనే తన ప్రధాన శిష్యురాలిగా ఉన్న శరణమ్మ ప్రభావతి అనే మహిళతో స్వామీజీకి వివాహేతర సంబంధం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, ఆమె మఠం ఆస్తిలో తనకూ వాటా ఇవ్వాలని స్వామీజీని కోరగా, ఆయన నిరాకరించాడట. దీంతో, ప్రభావతి కిరోసిన్ పోసుకుని నిప్పటించుకుంది. అలాగే వెళ్లి స్వామీజీని కౌగిలించుకుంది. ఆ సమయంలో ఆయన పూజ చేసుకుంటున్నాడు. అప్పటికే ప్రభావతిని అగ్నికీలలు చుట్టుముట్టగా, ఆమె వచ్చి స్వామీజీని కౌగిలించుకోవడంతో ఆయన కూడా మంటలబారినపడ్డాడు. ఈ ఘటనలో ప్రభావతి మరణించగా, శివానంద స్వామీజీ తీవ్రగాయాలపాలయ్యాడు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడట.

  • Loading...

More Telugu News