: డివిల్లీర్స్ రికార్డుపై కన్నేసిన అఫ్రిది


పాకిస్థాన్ విధ్వంసక ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును మళ్లీ తన పేరిట లిఖించుకునేందుకు ప్రయత్నిస్తానంటున్నాడు. 1996లో నైరోబిలో జరిగిన ముక్కోణపు సిరీస్ లో శ్రీలంకపై 37 బంతుల్లో సెంచరీ చేసి వరల్డ్ రికార్డుతో ప్రకంపనలు సృష్టించాడీ పఠాన్ యోధుడు. ఆ తర్వాత ఆ రికార్డును కివీస్ బ్యాట్స్ మన్ కోరే ఆండర్సన్ తిరగరాశాడు. ఆండర్సన్ 36 బంతుల్లో శతకం నమోదు చేయగా, తాజాగా, దక్షిణాఫ్రికా బ్యాటింగ్ కింగ్ ఏబీ డివిల్లీర్స్ శివమెత్తిన రీతిలో కేవలం 31 బంతుల్లోనే 100 పరుగులు చేసి సరికొత్త రికార్డు స్థాపించాడు. ఇప్పుడా రికార్డుపై అఫ్రిది కన్నేశాడు. న్యూజిలాండ్ టూర్లోగానీ, వరల్డ్ కప్ సందర్భంగాగానీ ఆ రికార్డును బద్దలు కొట్టేందుకు ప్రయత్నిస్తానని అఫ్రిది చెబుతున్నాడు. అయితే, ముందుగా అనుకుని అలాంటి రికార్డులు నమోదు చేయలేమని అభిప్రాయపడ్డాడు. అన్నీ అనుకూలించాలని అన్నాడు.

  • Loading...

More Telugu News