: గిన్నీస్ రికార్డు సృష్టించిన 'జన్ ధన్ యోజన' పథకం


ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'జన్ ధన్ యోజన' పథకం రికార్డు నెలకొల్పింది. ఈ పథకం కింద తక్కువ సమయంలో గరిష్ఠ సంఖ్యలో బ్యాంకు ఖాతాలు ప్రారంభమవడం విశేషం. ఐదు నెలల్లో 11.5 కోట్ల బ్యాంకు ఖాతాలను జన్ ధన్ యోజన కింద తెరిచారు. దానిని గుర్తించిన గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారులు ఈ పథకానికి అధికారికంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి సర్టిఫికెట్ ను అందజేశారు. గతేడాది ఆగస్టు 28న ఈ పథకాన్ని ప్రారంభించగా, జనవరి 26 కల్లా 7.5 కోట్ల కుటుంబాలను పథకం కిందకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క కుటుంబానికి ఖాతా ఉండాలన్నదే పథకం ఉద్దేశమని జైట్లీ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News